ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గ్యాస్‌లీకై ఒకరు మరణించగా మరో 9 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీకై అందులో పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురి కాగా చికిత్సపొందుతూ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అమిత్(23) అనే కార్మికుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన కార్మికులను గాజువాకలోని పవన్‌సాయి ఆసుపత్రికి తరలించారు.ఘటనా విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి బాధితులకు అండగా ఉండాలని జిల్లా మంత్రులను ఆదేశించారు. పరిశ్రమల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా నిర్లక్ష్యంపై హోం మంత్రి వంగలపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంక్ నుంచి లిక్వడ్ హెచ్‌సీఎల్ లీకైందని కలెక్టర్ తెలిపారు. తొమ్మిది మంది కార్మికులకు శ్వాస, దగ్గు సమస్యలు వచ్చాయని తెలిపారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
Admin
Aakanksha News