ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / నెల్లూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీ రాసలీలలను భార్య బయటపెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భార్య ఆరోపించింది. వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెట్ గా పట్టుకుంది. దీంతో ఇదేంటని ప్రశ్నించిన భార్యను డీఐజీ చితక బాదడంతో తీవ్ర గాయాలైయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ తన తోటి ఉద్యోగి ఐన అనుసూయా రాణిని 26 సంవత్సరాల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం నుండి తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారని వాపోయింది. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు .దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు.కాగా పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా భర్త కిరణ్ కుమార్ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు.ఐన కూడా తనలో ఎటువంటి మార్పు రాలేదని రోజు రోజుకు తన వికృత చేష్టలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Admin
Aakanksha News