Wednesday, 23 September 2026 11:27:56 PM

ఎంత మంది పీకేలు వచ్చినా టీడీపీని బ్రతికించ లేరు...

చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే వ్యూహకర్త పనికొస్తారు..రాజకీయాల కోసం తండ్రి, కొడుకులు ఎంతటి నీచానికైనా దిగజారుతారు...మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా

Date : 23 December 2023 07:56 PM Views : 357

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు పీకేల( ప్రశాంత్‌ కిషోర్‌, పవన్‌ కల్యాణ్‌) వల్ల టీడీపీ బ్రతికే పరిస్థితులు లేవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యనించారు. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే రాజకీయ వ్యూహకర్త పనికొస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడని విమర్శించారు. శనివారం విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటి అయినా ప్రశాంత్‌ కిషోర్‌ విషయంపై మీడియాతో మంత్రి మాట్లాడారు.తమ రాజకీయాల కోసం తండ్రి, కొడుకు చంద్రబాబు లోకేశ్‌ ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఈ భేటి ఒక నిదర్శనమని అన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ను బీహార్‌ డెకాయిట్‌ చంద్రబాబు వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. ‘ మేటిరియల్‌ బాగా లేకపోతే మేస్త్రి ఏం చేస్తాడని’ భేటిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా రాబోయే ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యమని వెల్లడించారు. వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఆ పార్టీకి ఎలాంటి మేలు జరుగదని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :