ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : పాదయాత్రతో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల్నిపూర్తిగా అర్థం చేసుకున్నానని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌరసేవలను ఈ సేవగా మార్చి..ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారని అన్నారు. ప్రభుత్వం నుంచి సేవలు అందుకోవాలంటే.. చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి ప్రజలదని, అందుకే సులభతరంగా పౌరసేవలు అందాలని నిర్ణయించామని చెప్పారు. సులువుగా సర్టిఫికేట్లు జారీ చేసేలా వాట్సప్ గవర్నెనెన్స్ తెచ్చామని, 200 పౌర సేవలు వాట్సప్ ద్వారా అందించగలుగుతున్నామని తెలియజేశారు. ఈ నెలాఖరుకు 300 పౌరసేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.
Admin
Aakanksha News