ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : కాకినాడ జిల్లా జనసేనపార్టీ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు)ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) చైర్మన్ నియమించింది. ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు, జనసైనికులు భారీస్థాయిలో ర్యాలీగా బయలుదేరి తుమ్మల రామస్వామి (బాబు) స్వగ్రామమైన పులిమేరు గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి కార్లులో ర్యాలీగా కాకినాడ ఎన్.ఎఫ్.ఎఫ్.సి.ఎల్ రోడ్డులో గల కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) కార్యాలయానికి చేరుకొని అక్కడ తుమ్మల సీతారామస్వామి (బాబు) ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ శాఖ నాగేశ్వరరావు (నాగు), విద్యా కమిటీ మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, దుర్గాడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెలుగుల సతీష్, గుండ్ర సీతారాం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్మూరి కృష్ణ, రావుల తాతారావు, కొలా రమణ, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, మొగిలి శ్రీను, గొల్లపల్లి శ్రీను, జ్యోతుల నానాజీ, కాపారపు వెంకటరమణ (పూసలు), సాధనాల చంటిరాము, కొప్పుల చక్రధర్, పోలం త్రిమూర్తులు, జ్యోతుల వాసు, కొలా శివ, అయినవిల్లి శ్రీను, సఖినాల రాంబాబు, యింటి నాగేశ్వరరావు, జ్యోతుల గోపి, కీర్తి చిన్న, జ్యోతుల శివ, శేచెట్టి భద్రం, మంతెన లక్ష్మణ్, జ్యోతుల శివశంకర్, కోలా నాని, నేమాల కన్నయ్య, జ్యోతుల చిన్నయ్య, రావుల రమణ, జ్యోతుల వీరబాబు, సఖినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News