ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : జనసేన నేత నాగబాబు త్వరలో రాజ్యసభకు వెళ్లబోతున్నారు. వైసిపికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య వేర్వేరు కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ విషయంపై స్పష్టత ఏర్పడింది.డిసెంబర్ 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 10న ముగియనున్నది. కాగా 13 తేదీల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఒక్క అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎంఎల్ఏల మద్దతు అవసరం. వైసిపికి ప్రస్తుతం ఉన్నది 11 మందే. ఈ నేపథ్యంలో వైసిపి ఈ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దాదాపు లేనట్టే.
Admin
Aakanksha News