ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Admin
Aakanksha News