ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : చేతికి అందివచ్చిన పంటను కళ్ళు ముందే పాడు చేశారని పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం మాజీ సర్పంచ్ వడ్డీ నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో కె.ఎస్.ఈ.జెడ్ (కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్) తమ పంట భూములను తీసుకుని మరొక చోట పంటకు పనికిరాని భూమిని ఇచ్చారని ఆరోపించారు. భూమిని తీసుకునేటప్పుడు కె.ఎస్.ఈ.జెడ్ యాజమాన్యానికి మా భూమిలో ఉన్న పంటను తీసుకునే వరకు అవకాశం ఇవ్వాలని తెలియజేశామని అన్నారు. కానీ ఇప్పుడు తను వ్యక్తిగతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని కావడంతో మా భూమిలో ఉన్న జీడి మామిడి చెట్లు, మామిడి చెట్లు రాత్రి రాత్రికే మిషన్లు సహాయంతో పాడు చేశారని ఆరోపించారు. లక్షలు విలువచేసే మామిడి తోటను నాశనం చేశారని మీడియా ముందు మాజీ సర్పంచ్ వడ్డి నాగమణి కంటతడి పెట్టుకుంది.
Admin
Aakanksha News