ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కృష్ణా జిల్లా : వైఎస్సార్ సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆయన నేరుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే గుండెపోటు కారణంగానే నానిని ఆసుపత్రిలో చేర్చారన్న వార్తలు బుధవారం సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి.కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా కోడలి నాని ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2004లో రాజకీయాల్లోకి వచ్చిన నాని.. టీడీపీ తరఫున 2004 నుండి 2009 గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరిన నాని…ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు.2014, 2019 ఎన్నికల్లోనూ గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని… వైసీపీ అధికారంలోకి రాగానే… జగన్ మొదటి కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్గుగా సమాచారం.
Admin
Aakanksha News