Friday, 17 April 2026 09:29:45 AM

చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు...

మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

Date : 14 February 2024 08:35 PM Views : 392

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారంటూ ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంట నక్క చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలన్నారు. ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు ఒకపక్క దత్తపుత్రుడు, మరో పక్క ఉత్తపుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మను, లేటెస్ట్‌గా ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వీళ్ళందరూ ఉన్న దైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలు మబ్బులో పెడదామని వెళ్ళారన్నారు. అక్కడ ఉన్నది అమిత్ షా, మోడీ కావడంతో వాల్లిచ్చిన ఆఫర్ దెబ్బకు.... హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుండి ఏపీకి రావడం లేదంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందని కొడాలి నాని విమర్శలు గుప్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :