Wednesday, 23 September 2026 11:30:08 PM

అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి....

జగన్‍కు షర్మిల సవాల్

Date : 08 November 2024 07:22 PM Views : 442

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కడప జిల్లా : జగన్ మాత్రమే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి వెళ్లనంటే.. తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల సవాల్ విసిరారు. సొంత సోదరుడైనప్పటికీ కొంత కాలంగా రాజకీయంగా జగన్, షర్మిల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మీడియా సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శాసనసభకు వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమంటే ఇవ్వడం లేదని, దీంతో తానకు అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేదని జగన్ తన మనసులో మాటను బయటపెట్టేశారు. తాజాగా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధ్యక్షులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :