Thursday, 24 September 2026 12:16:01 AM

సమీకృత పర్యాటక 2024-29 కి కేబినెట్‌ ఆమోదం...

సీఆర్‌డీఏ ఆమోదించిన 23 అంశాలకు గ్రీన్‌సిగ్నల్‌

Date : 03 December 2024 07:23 PM Views : 355

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం పలికింది. ముఖ్యంగా సమీకృత పర్యాటక 2024-29 కి ఆమోదం తెలిపింది.స్పోర్ట్స్‌ పాలసీలో మార్పులకు ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ (CRDA) ఆమోదించిన 23 అంశాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు, ఏపీ టెక్ట్స్‌టైల్‌,ఏపీ మారిటం, డిసెంబర్‌ 15న పొట్టి శ్రీరాములు ఆత్మారణ దినోత్సవాన్ని జరుపడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి అవాస్‌ యోజన పథకానికి, ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ 4.0కు ఓకే చెప్పింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశం చర్చించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :