Friday, 17 April 2026 09:30:43 AM

సమాజంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు...

మండిపడ్డ బీఎస్పీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు

Date : 10 December 2024 07:01 PM Views : 313

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : నేడు సమాజంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని బీఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు మండిపడ్డారు. డిసెంబర్ 10వ తేదీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వాటిపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మానవ హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వుందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా డిసెంబర్‌ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని, రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. మానవ హక్కులను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం శిక్షపడాలన్నారు. దళితుల పై హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా మానవ హక్కుల కమిషన్ గాని, మానవ హక్కుల సంఘాలుగాని స్పందించకపోవడం దారుణమన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :