Friday, 17 April 2026 10:23:17 AM

శౌర్య ప్రతాపలకు మారుపేరు మహా రాణా ప్రతాప్ సింగ్

వైభవంగా మహా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ప్రతిష్ట

Date : 20 November 2023 01:49 PM Views : 263

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : శౌర్య ప్రతాపలకు మారుపేరు మహా రాణా ప్రతాప్ సింగ్ అని పలువురు నేతలు పేర్కొన్నారు. ఆదివారం కోటప్ప కొండలో గల మహా రాణా ప్రతాప్ సింగ్ బొందిలి అన్నదాన సమాజ్ (సత్రం)నందు ఆంద్రప్రదేశ్ లో మొట్ట మొదటి మహా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం ప్రతిష్ట జరిగింది. ఈ సందర్బంగా అన్నదాన సత్రం కమిటీ ప్రెసిడెంట్ విజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మహా రాణా ప్రతాప్ సింగ్ బొందిలి కులం వాడు కావడం తమకెంతో గర్వంగా ఉందన్నారు.ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందకరంగా వుందన్నారు. ఈ విగ్రహాన్ని అఖిల భారత క్షత్రియ మహా సభ వారి సహకారంతో మహా రాణా ప్రతాప్ సింగ్ స్మారక్ అబ్యాన్ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రవీర్ సింగ్ నామానా బహుకరించినట్టుగా విజయ్ ప్రతాప్ సింగ్ తెలియజేసారు .విగ్రహ ఏర్పాటు కు సహకరించిన అఖిల భారత క్షత్రియ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ రాజా మానవేంద్ర సింగ్,నేషనల్ లేడి వింగ్ ప్రెసిడెంట్ కరిష్మా హడ,నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భవాని సింగ్ ,నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పండరి బాయి లకు ధన్యవాదాలు తెలిపారు. .ఈ కార్యక్రమానికి బొందిలి కుల మహిళలు వారి సాంప్రదాయ దుస్తులతో రాణా ప్రతాప్ విగ్రహానికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు .కార్యక్రమం లో సత్రం కమిటీ ప్రెసిడెంట్ విజయ్ ప్రతాప్ సింగ్ ,సెక్రెటరీ బాబీ సింగ్ ,ట్రెజరర్ రామ్ బాలాజీ సింగ్ ,మెంబర్స్ వీరాంజి సింగ్ ,చిన్న హనుమాన్ సింగ్ ,హనుమాన్ సింగ్ ,రాణా ప్రతాప్ సింగ్ ,ప్రియా సింగ్ ,సాంబ సింగ్ ,రాంసింగ్ ,ఘన్ సూర్ సింగ్ , లక్ష్మణ్ సింగ్ ,కోట రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు .

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :