Friday, 17 April 2026 10:24:24 AM

ఘనంగా వరుణ్ కంప్యూటర్స్ & ట్రావెల్స్ ప్రారంభం...

ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Date : 06 December 2024 06:43 PM Views : 303

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం పట్టణంలో స్థానిక రాజా రామోహనరావు పార్కు ఎదురుగా, రాజ్ క్లినికల్ ల్యాబ్ ప్రక్కన శుక్రవారం మధ్యాహ్నం వరుణ్ కంప్యూటర్స్ & ట్రావెల్స్ ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వర్మ మాట్లాడుతూ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముందుగా వరుణ్ కంప్యూటర్స్ & ట్రావెల్స్ ను స్థాపించిన చర్చి సెంటర్ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గమిడి నాగ భూషణం తనయుడు గమిడి ఫణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరుణ్ కంప్యూటర్స్ & ట్రావెల్స్ వ్యవస్థాపకుడు గమిడి ఫణి మాట్లాడుతూ తమ వ్యాపార సంస్థ వద్ద ఇంటర్నెట్, ఆన్లైన్ అప్లికేషన్లు, మనీ ట్రాన్స్ఫర్, ఆర్టీవో సర్వీసెస్, వెహికల్ ఇన్స్యూరెన్స్, వెహికల్ ఫైనాన్స్, ట్రైన్ టిక్కెట్లు, విమాన టిక్కెట్లు, బస్ టిక్కెట్లు, పాస్ పోర్ట్ సర్వీస్, దర్శనం టిక్కెట్లు, రూమ్ బుకింగ్, జిరాక్స్, లామినేషన్ ఇతర సర్వీసులు వినియోగదారులకు అందించడం జరుగుతుందని, వినియోగదారులు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి చిన్నా, పాదగయ మాజీ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్, ఎస్.వి.ఎస్.ఎన్.రవి, 10వ వార్డు కౌన్సిలర్ అల్లవరపు నగేష్, పిఠాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నల్లా శ్రీను, కనకమహాలక్ష్మి ఆటో యూనియన్ అధ్యక్షుడు దవులూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :