Friday, 17 April 2026 09:33:45 AM

బాలుని కంటి చికిత్స కు వెస్సో సహాయం

Date : 20 October 2023 05:09 PM Views : 300

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : గుంటూరు పట్టణానికి చెందిన కోసూరి చంద్రశేఖర్ దినసరి వేతనానికి పెయింటర్ గా పని స్తుంటారు. కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై, పనులు లేక ఆర్థికంగా చితికి పోయారు. ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితి!.ఆరవ తరగతి చదువుతున్న వారి కుమారుడు కార్తీక్(11) మంచి ప్రతిభ కలిగిన విద్యార్థి. దురదృష్టవశాత్తు పురిటిలోనే ఎడమ కన్ను వాపుతో పుట్టాడు. సంవత్సరం తర్వాత అది ఇన్ఫెక్షన్ కు దారి తీసి కంటి నుండి నీరు రావడం మొదలయింది. అనేక వైద్య పరీక్షల అనంతరం, వ్యాధి తీవ్రత కారణంగా, హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కను గుడ్డును పూర్తిగా తొలగించడం వలన, కార్తీక్ ఎడమ కంటికి శాశ్వత అంధత్వం ప్రాప్తించింది.కార్తీక్ కంటికి కృత్రిమ గాజు కన్ను అమర్చటానికి సహాయం చేయమని స్థానిక నేతల ద్వారా చంద్రశేఖర్ వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో కార్తీక్ తండ్రి కి రూ.51,501/- అందచేసింది.ఈ సందర్బంగా ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు చిన్న వయసులోనే అంధత్వంతో బాధ పడుతున్న కార్తీక్ చికిత్సకు సహాయం చేసి, ఆ బాబుకు ఆత్మ విశ్వాసం పెరిగేందుకు దోహదపడిన గౌరవ దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :