Wednesday, 23 September 2026 11:28:58 PM

విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరణ...

Date : 12 February 2024 06:18 PM Views : 415

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేంజ్ ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. ఆరు నెలలు యన్‌డీపీఎస్ కేసులు మీద మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున ఏజెన్సీ ఏరియాలో మరింత దృష్టి పెడతామన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విశాల్ గున్ని పేర్కొ్న్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :