ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు , సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈనెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ప్రత్యేక దర్శనాల రద్దు చేసినట్టు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 10న ఉదయం 4.30 గంటలరే ప్రొటోకాల్ దర్శనాలు , 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందని అన్నారు.టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనాలకు అనుమతి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుపతిలోని ప్రత్యేక టోకెన్ల జారీ కేంద్రాల ద్వారా టోకెన్లు అందజేస్తున్నామని తెలిపారు.
Admin
Aakanksha News