ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : కార్తీక మాసం అంటే పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెల వచ్చిందంటే మహిళలు శివాలయాల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా అందరూ ఆత్మీయంగా కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించుకుంటారు. పిఠాపురం నియోజకవర్గంలోని కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం మాధవపురం రోడ్డులోని రావుల వెంకట రమణ తోటలో వన భోజనాలు నిర్వహించారు. వనభోజనాల సందర్భంగా మహిళలకు, పిల్లలకు విజ్ఞాన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు, పాటల పోటీలు ఏర్పాటు చేశారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. పిల్లా సత్యనారాయణ శిష్య బృందం చేసిన సాంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరి గేయంతో చేసిన కోలాటం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు, కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్, జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు కర్ణ మురళీకృష్ణమనాయుడు, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ అభ్యర్థి పెరాబత్తుల రాజశేఖర్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యి, కాపు జాతి అభివృద్ధికోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ ఐక్యతగా వుండి కాపు, ఒంటరి, బలిజ, తెలగ జాతి కోసం పాటుపడాలని కోరారు. కాపు ఐక్యవేదిక అధ్యక్షుడు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన కాపు సోదరులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఏడు సంవత్సరాలుగా ఈ మన భోజనాల కార్యక్రమం నిర్విరామంగా జరుగుతున్నామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని సహపంక్తి భోజనాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మంది హాజరయ్యారు అన్నారు. మాల స్వీకరించిన స్వాములకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు దేవరపల్లి చిన్నబాబు, రావుల వెంకటరమణ, డాక్టర్ వరలక్ష్మి, వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లవరపు నాగమల్లేశ్వరి, జనసేన నాయకులు మాదేపల్లి శ్రీను, మత్సా అప్పాజీ, చెల్లుబోయిన సతీష్, వైసీపీ నాయకులు కొప్పన శివనాథ్, జవ్వాది కృష్ణ మాధవరావు, ముమ్మిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News