Saturday, 07 December 2024 01:55:49 PM

మానవ సమానత్వం కోసం వేసిన మొదటి అడుగు...రాజ్యంగ గ్రంథం

శీర్షిక : రాజ్యంగ అమృతోత్సవం

Date : 27 November 2024 08:46 AM Views : 70

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : సర్వ సమాన హక్కుల కోసం మొదలు పెట్టిన యుద్ధ దినం. మానవ సమానత్వం కోసం వేసిన మొదటి అడుగు రేయింబవళ్ళు కష్టించి రచించిన రాజ్యంగ గ్రంథం నేటి తరాలకు ఒక వరమనే చెప్పాలి.కుల మత వర్గ బేధాలు లేకుండా ఐకమత్యంతో మెలగడం కోసం ఆనాడు ఆ అంబేధ్కరుడు గొప్ప యుద్ధమే చేశాడు.జీవం ఉన్న ప్రతి ప్రాణికీ హక్కులున్నాయి చాటి చెప్తూమత మార్పిడి మీ ఇస్టమని చెప్పారు. వర్గ భేదాల మధ్య చిచ్చు రగలకుండా సమాన హక్కులను అందరికీ పంచారు.చట్టం ముందు అందరూ సమానులే అని చాటి చెప్పారు.2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కష్టం నేడు జన సౌభ్రాతృత్వాన్ని ప్రతీకగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా చరిత్రకెక్కింది. రాజ్యాంగ రూపకల్పన ద్వారా భారత దేశంలో ప్రతి పౌరుడు అన్యాయ చీకట్లను చేల్చుతూ న్యాయ బద్దంగా జీవించే వెలుగులను దేశం నలుమూలల విరజల్లింది.ప్రజా స్వామ్య పరిపాలనా దేశం మనది. నాయకులే అవసరం లేని రాజ్యాంగం మనది రాజనీతికి ప్రతీక మన రాజ్యంగలోని ప్రతి అంశం.దేశ పౌరునిగా రాజ్యాంగ పఠనం చేసి రాజ్యాంగ విలవలను తెలుసుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం గా ఉన్న అందరూ సమానమే అన్న నినాదాన్ని చాటి చెప్పాలి.విద్యార్థి దశలో చేసేది పుస్తక పఠనం ప్రతి మతానికి విలువలు చెప్పడానికి ఉంది మత గ్రంథం.కానీ ప్రతీ భారత పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి...

పోలగాని భానుతేజశ్రీ రచయిత.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :