Thursday, 24 September 2026 12:23:46 AM

ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు...

పట్టణ ఎస్ఐ మణికుమార్

Date : 28 January 2025 08:55 PM Views : 425

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవమని పిఠాపురం పట్టణ ఎస్ఐ వి.మణికుమార్ అన్నారు. మంగళవారం పిఠాపురం పట్టణంలోని స్థానిక ఆర్.ఆర్.బి.హెచ్ఆర్. జూనియర్ కాలేజ్ వద్ద పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ మరియు పిఠాపురం పట్టణ ఎస్ఐలు వి.మణికుమార్ వారి సిబ్బందితో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు పత్రాలు లేనటువంటి వాహనాలని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా కాలేజీలు, స్కూల్స్ వదిలే సమయంలో ఈవ్ టీజింగ్ జరగకుండా ప్రతి స్కూలు, కాలేజీల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :