Tuesday, 22 September 2026 10:11:12 PM

ఫిరంగిపురంలో ప్రేమోన్మాది ఘాతుకం..

యువతి, కుటుంబ సభ్యులపై కత్తితో దాడి

Date : 24 October 2022 08:20 AM Views : 411

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ప్రేమించాలని కొన్నాళ్లుగా యువతి వెంటపడుతున్న ఏడుకొండలు అనే యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రేమ పేరిట ఓ కిరాతకుడు దారుణానికి తెగబడ్డాడు.నిశ్చితార్థమైన యువతిని ప్రేమిస్తున్నానంటూ, పేరం ఏడుకొండలు అనే వ్యక్తి కొన్నాళ్లుగా వేధించాడు. దీంతో ప్రేమను నిరాకరించిన ఆమెపై ఆగ్రహించిన ఏడుకొండలు దాడికి పాల్పడ్డాడు.ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశాడు. మొత్తం 12 మందిని గాయపరిచాడు. ఆమెతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో.. గుంటూరు జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తుండగా..మిగతా 9 మందిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :