ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పశ్చిమగోదావరి జిల్లా : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడేందుకు టీడీపీ, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఒక్క మగాడైనా లేడని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతు..పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా మార్చడంపై పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మూడు పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నాయని విమర్శించారు. బనకచర్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ రాష్ట్ర ప్రయోజనాలేనని స్పష్టం చేశారు. విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు.రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా... నిధులు ఇవ్వకుండా అప్పుల పేరుతో రాష్ట్రాన్ని లోటులోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News