ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం కత్తులగూడెం జై భీమ్ దళిత యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ దళిత యువజన సంక్షేమ సంఘం కమిటీ సెక్రటరీ ఖండవల్లి చిన లోవరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శనీయుడని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మనమందరం స్వేచ్చగా జీవిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ ముమ్మిడి శ్రీనివాస్, ది పిఠాపురం అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, చెల్లూరు లోవరాజు, 24వ వార్డు కౌన్సిలర్ ఎస్.శీను, యాదాల అప్పారావు బోడపాటి గంగరాజు, గొల్లపల్లి సుబ్బారావు, కడితి దుర్గబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News