Friday, 17 April 2026 01:31:53 PM

అధికారంలోకి వచ్చాక...బట్టలు ఊడదీసి కొడతాం...

కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్...

Date : 18 February 2025 01:24 PM Views : 628

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : అధికారంలోకి వచ్చాక...బట్టలు ఊడదీసి కొడతామని వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వాఖ్యలు చేసారు. టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీతో మంగళవారం విజయవాడ సబ్‌ జైల్లో ములాఖత్‌ ఐన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు...రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్‌ ఆర్డర్‌కు వంశీ అరెస్ట్‌ అద్దం పడుతోందని అన్నారు.వంశీపై తప్పుడు కేసులు పెట్టారని.పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందన్నారు.. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారని విమర్శించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్‌ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్‌ చేశారు. సత్యవర్ధన్‌ నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు.. అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :