ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేశారు. సీఎం భద్రతావలయంలోకి బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ సిబ్బందికి అదనంగా ఇప్పుడు కౌంటర్ యాక్షన్ బృందాలు కూడా వచ్చి చేరాయి.భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, సీఎం రక్షణ విషయంలో రాజీపడకుండా కౌంటర్ యాక్షన్ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉండనున్నారు. వీరు ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్‌పీజీ శిక్షణలో రాటుదేలారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్‌నూ అమలు చేస్తున్నారు. నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంట్‌ను ధరిస్తారు. ఎమర్జెన్సీ టైమ్‌లో మొదటి వలయంలో ఉండే ఎన్‌ఎస్‌జీ, రెండో వలయంలో ఉండే ఎస్‌ఎస్‌జీ సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే.. బయట నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై కౌంటర్ యాక్షన్ టీమ్ దృష్టి సారిస్తుంది.
Admin
Aakanksha News