ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / న్యూఢిల్లీ : ఓ కోడలు క్రూర మృగంలా ప్రవర్తించింది. వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.. మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ(87) అనే వృద్ధుడు కుల్‌శేఖర్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అయితే పద్మనాభ కోడలు ఉమా శంకరి మార్చి 9వ తేదీన అతనిపై దాడి చేసింది. చేతి కర్రతో విచక్షణారహితంగా చితకబాదింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.వృద్ధుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉమా శంకరిని పోలీసులు అరెస్టు చేశారు. అట్టవార్‌లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉమా ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభ కూతురు డిమాండ్ చేసింది.
Admin
Aakanksha News