ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : ప్రపంచ దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో కలిసికట్టుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అన్ని దేశాలు కలిసి రోదసి పరిశోధనలు చేస్తే, భూమి మీద సమస్యలు ఉండవన్నారు. సంపద అందరికీ సమానంగా అందకపోవడం వల్లే భూమి మీద సమస్యలు వస్తున్నాయని, ఒకవేళ స్పేస్ ప్రోగ్రాముల్లో దేశాలు పోటీపడితే, ఇలాంటి సమస్యలు అంతరిక్షంలో కూడా వస్తాయన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని కూనూరులో ఆయన నివాసం ఉంటున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. హీలియంతో పాటు అరుదైన కొన్ని ఖనిజాలు భూమి మీద అంతరిస్తున్నాయని, వాటి కోసం అంతరిక్షంలోని ఆస్టరాయిడ్స్‌పై భవిష్యత్తులో మైనింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు శర్మ అంచనా వేశారు. జాతీయ జెండాలను ధరించి అంతరిక్షానికి వెళ్తే, అప్పుడు సమస్యలు అక్కడ కూడా వస్తాయన్నారు. అందుకే స్పేస్ పరిశోధనల్లో కలిసికట్టుగా ఉండాలన్నారు. ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతరిక్ష పరిశోధనలు చేపడితే, అక్కడ ఉన్న వనరుల్ని భూమికి తీసుకువస్తే, అప్పుడు భూమిపై సమస్యలు తొలిగిపోతాయన్నారు. లేదంటే భూమి మీద ఉన్న పరిస్థితులే అక్కడ కూడా తయారవుతాయన్నారు.శాటిలైట్ టెక్నాలజీలో ఇండియా మంచి స్థితిలో ఉన్నదని, అంతరిక్షంలో ఎక్కువ కాలం మనుషులు జీవించవచ్చు అన్న సమాచారం రష్యా వద్ద ఉన్నదని, అమెరికా వద్ద అత్యాధునిక టెక్నాలజీ ఉన్నదని రాకేశ్ శర్మ తెలిపారు. భారతీయుడిగానో, రష్యన్‌గానో, చైనీస్, అమెరికా పౌరుడిగానో స్పేస్‌లోకి వెళ్లవద్దు అని, భూమి నుంచి వెళ్లిన మనుషులుగా అంతరిక్షానికి వెళ్లాలని, అలాంటి మార్పు రావాలని, ఎందుకంటే భూమి నుంచి వేల కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ నేను భారతీయుడిని, రష్యన్‌ను, చైనా, అమెరికా దేశస్థుడని చెప్పుకోలేమన్నారు.రాకేశ్ శర్మకు హీరో ఆఫ్ ద సోవియేట్ యూనియన్ అవార్డు దక్కింది. రష్యాకు చెందిన మిగ్-21, మిగ్-23, మిగ్-27 యుద్ధ విమానాలను నడిపినట్లు చెప్పారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో 21 సార్లు మిగ్-21 యుద్ధ విమానాన్ని నడిపినట్లు వెల్లడించారు. మిగ్-21 విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డానని, ఎందుకంటే దాంట్లే అన్నీ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నట్లు చెప్పారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన సోయేజ్ టీ11 వ్యోమనౌక ద్వారా ఆయన సాల్‌యుట్-7 స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. 1982 ఏప్రిల్‌లో ఆయన ఆ ట్రిప్ చేశారు. 8 రోజులు అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మ.. ఆ స్పేస్ నుంచి భారత్‌ను ఫోటో తీశాడు. భారరహిత స్థితిలో శరీరంపై ఎటువంటి ప్రభావం పడుతుందన్న కోణంలో యోగా ఎక్స్‌సైజుల ద్వారా స్టడీ కూడా చేశాడు.భారత వైమానిక దళానికి చెందిన రాకేశ్ శర్మతో పాటు మరో పైలెట్ రావిష్ మల్హోత్రా కూడా రష్యాలో శిక్షణకు ఎంపికయ్యారు. కానీ రాకేశ్ శర్మ మాత్రమే నింగిలోకి వెళ్లారు. అనేక అంశాలపై ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.శిక్షణ కోసం రష్యా వెళ్లిన సమయంలో.. ఆ దేశ భాష అర్థం కాలేదన్నారు. కానీ శిక్షణ కొనసాగుతున్నా కొద్దీ.. రష్యన్ భాషపై పట్టు వచ్చిందన్నారు. ఇక రష్యాలో ఉన్న అతిశీతల వాతావరణాన్ని తట్టుకోవడం కూడా కష్టమైందేనన్నారు. వింటర్ సీజన్‌లో మైనస్ 30 ఉష్ణోగ్రతలో గడపాల్సి వచ్చినట్లు చెప్పారు. సాల్‌యుట్-7 స్పేస్ స్టేషన్ 1971లో తొలిసారి లాంచ్ చేశారు. 1991 వరకు ఆ స్పేస్ స్టేషన్ ఉన్నది. 1982లో రాకేశ్ శర్మ ఆ స్టేషన్‌లో భూమి చుట్టూ రౌండేశారు.అంతరిక్షంలోకి వెళ్లి.. కిందకు చూస్తూ.. భూమి మీద హద్దులు ఏమీ కనిపించవని రాకేశ్ శర్మ తన ఇంటర్వ్యూలో ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News