Friday, 21 March 2025 09:52:13 AM

ఒక్క ప్రేయసితో...ఇద్దరు ప్రియులు...

అత్త ఎంట్రీతో బయటపడ్డ కోడలు బాగోతం

Date : 02 May 2023 09:14 AM Views : 448

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / నేషనల్ వార్తలు : వివాహేత‌ర‌ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వివాహం తరువాత వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ క్షణికవేశంలో వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. వివాహేత‌ర‌ బంధాల మోజులో పడి హత్యలు చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరెన్నో కుటుంబాలు సైతం రోడ్డుపాలు అవుతున్నాయి.ఇలాంటి తరహా కేసులు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వివాహిత ఒకే గదిలో ఇద్దరితో అభ్యంతర స్థితిలో ఉండగా సడన్ గా అత్త ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జరిగే సన్నివేశం చూసి ఒక్క సరిగా ఖంగుతింది.కోడలు అలా చేయడం చూసి కోపోద్రిక్తురాలై గదికి తాళంవేసి పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే యువకుడికి పక్క గ్రామంకు చెందిన యువతితో వివాహం అయింది. పెళ్లి అయిన కొద్దిరోజులకు సదరు వ్యక్తి ఉపాధికోసం సౌదీ అరేబీయా వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో.. భార్య పక్కగ్రామంలోని తన పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కొద్దికాలానికి పుట్టింటి వద్ద తనకు బంధువులైన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. తన పుట్టింటికి వెళ్లినప్పుడల్లా వారిద్దరిని కలిసి వస్తుండేది.ఇలా వివాహేత‌ర‌ సంబంధం వ్యవహారం గుట్టుచప్పుడుగా కొంత కాలం సాగించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు వారిద్దరిని నేరుగా ఇంటికి పిలవడం మొదలు పెట్టింది. అత్తామామలకు బంధువులేనని, తమ అమ్మవారి తరపు వారని చెప్పేది. పలుసార్లు వాళ్లు ఇంటికి వచ్చిపోతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికిరాగా.. తన కోడలు, ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉన్నారు. రూంలో వారు ఏం చేస్తున్నారో చూసేందుకు అత్తవెళ్లగా.. తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో అసభ్యకర రీతిలో లీనమైపోగా… కోడలు చేసే పనిని కన్నంలో నుంచి చూసి కంగుతింది. ఎలాగైనా రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవాలని భావించింది. కొడుకుకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే తాళం తెచ్చి రూం తలుపుకు వేసింది. వెంటనే ఫోన్ అందుకుని 112 నెంబర్‌కు డయల్ చేసి పోలీసులకు విషయం చెప్పంది. పోలీసులు అక్కడికి చేరుకొని వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అత్త పిర్యాదు మేరకు కోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :