Wednesday, 23 April 2025 01:42:29 AM

విద్య, ఉద్యోగ, రంగాల్లో 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి...

లింగాయత్ పంచమసాలి వర్గీయులు ఆందోళన

Date : 10 December 2024 07:51 PM Views : 264

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : కర్ణాటక లోని బెళగావి రణరంగంగా మారింది. విద్య, ఉద్యోగ, రంగాల్లో 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లింగాయత్ పంచమసాలి వర్గీయులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి బెళగావికి ర్యాలీగా చేరుకున్న ఆందోళనకారులు , తమ డిమాండ్లను పరిష్కరించకపోతే విధాన సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీస్‌లు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఇదే సరైన సమయమని ఆందోళనకారులు భావించారు.మంగళవారం ఓవైపు సమావేశాలు జరుగుతుండగానే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ దూసుకుపోయేందుకు యత్నించారు. పలువురు ఉన్నతాధికారుల కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. అంతకు ముందే ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మృత్యుంజయ్ స్వామీజీతోపాటు పలువురు భాజపా నేతలు, ఆందోళనకారులను పోలీసులు ముందస్తుగా అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రిజర్వేషన్లను మరింత పెంచాలని లింగాయత్ పంచమసాలీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం కోటాను 15 శాతానికి పెంచాలని కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :