ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / నేషనల్ వార్తలు : రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామోడీ ను దుండగులు కాల్చిచంపారు. దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.విశ్వసనీయ వర్గాల కథన ప్రకారం, సుఖదేవ్ సింగ్‌ను చంపుతామంటూ గతంలో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రూ నుంచి పోలీసులకు బెదరింపు కాల్స్ వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే భారీగా పోలీసులు బలగాలను శ్యామ్‌నగర్ ప్రాంతంలో మోహరించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గన్‌మెన్ నరేంద్రపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. అయితే సుఖ్‌దేవ్ సింగ్‌పై అగంతకులు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారనేది తెలియాల్సి ఉంది.రాష్ట్రీయ కర్ని సేనతో చాలాకాలంగా సుఖ్‌దేవ్ సింగ్‌కు అనుబంధం ఉంది. కొద్దికాలం క్రితం కర్నిసేనతో విభేదాలు రావడంతో ఆయన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు. బాలీవుడ్ చిత్రం పద్మావత్, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత రాజస్థాన్‌లో జరిగిన పలు ధర్నాలతో ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ అంశాలకు సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Admin
Aakanksha News