ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి మెహ్రాజ్ మలిక్(36) దోడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన బిజెపి అభ్యర్థి గజయ్ సింగ్ రాణాను ఓడించారు. బిజెపి, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులను ఓడించేందుకు మలిక్ చాలా ప్రచారం చేశారు.మలిక్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కౌన్సిలర్(డిడిసి)గా ఎన్నికయ్యాక చాలా పాపులర్ అయ్యారు. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను తీవ్రంగా విమర్శించడంతో విశేష ప్రజాదరణ పొందారు. కొండ ప్రాంతపు నియోజకవర్గంలో కనీస వసతులు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చి ఆయన ఓట్లడిగారు. ప్రజలు నమ్మి ఆయనను గెలిపించారు. కశ్మీర్ లో ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది. అక్కడ ఓటింగ్ 63.45 శాతం పడింది. 2014లో ఓటింగ్ 65.52 శాతంగా ఉండింది. కానీ ఇప్పుడు కాస్త తగ్గింది.
Admin
Aakanksha News