Tuesday, 22 September 2026 11:07:56 AM

చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతం: ఇస్రో

Date : 05 December 2023 03:31 PM Views : 370

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది. ‘‘ అరుదైన ప్రయోగంలో ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఇంజెక్షన్ ప్రక్రియల ద్వారా ప్రొపల్షన్ మాడ్యుల్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టాం’’ అని వివరించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రయోగాల కోసం చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని వివరించింది. చంద్రుడి నుంచి భూమికి తీసుకొచ్చే ప్రణాళికలు, వాటి అమలుపై పనిచేస్తున్నామని తెలిపింది. ఇలాంటి విన్యాసాల కోసం సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేసతున్నామని, తాజాగా చేపట్టింది ప్రాథమిక ప్రయోగమని ప్రకటనలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ప్రొపల్షన్ మాడ్యూల్ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తున్నామని, తద్వారా అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా జాగ్రత్తలు ప్రయత్నిస్తున్నామని ఇస్రో వివరించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :