Thursday, 05 March 2026 03:05:48 AM

అక్రమ వలసదారులపై భారత్‌తో చర్చలు: డొనాల్డ్ ట్రంప్.

Date : 28 January 2025 05:43 PM Views : 773

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : అక్రమ వలసదారులపై భారత్‌తో చర్చలు సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ‘ఏది సరైన పనో’ ప్రధాని నరేంద్ర మోడీ అదే చేస్తారని అన్నారు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో వైట్ హౌస్‌ను సందర్శించే అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు. విడిగా ఉభయ అధినేతల మధ్య ఫోన్ కాల్ గురించిన ఒక నివేదికను వైట్ హౌస్ చదువుతూ, మోడీతో ట్రంప్ ‘ఉత్పాదక’ ఫోన్ కాల్ చేశారని, భారత్, యుఎస్ మధ్య ‘న్యాయమైన’ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, ప్రగాఢ సహకారం దిశగా సాగాలని ట్రంప్ కోరారని తెలియజేసింది.కాగా సోమవారం ఫ్లోరిడా రిట్రీట్‌లో హౌస్ రిపబ్లికన్లతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు ‘హాని కలిగించే’ దేశాలపై యుఎస్ టారిఫ్‌లు విధించగలదని చెప్పారు. ఆయన ఈ సందర్భంగా అధిక టారిఫ్ దేశాలుగా చైనా, ఇండియా, బ్రెజిల్‌లను ప్రస్తావించారు. ‘మనకు నిజంగా హాని కలిగిస్తున్నారని భావించే బాహ్య దేశాలు, బాహ్య వ్యక్తులపూ మనం టారిఫ్‌లు విధించబోతున్నాం. ఇతరులు ఏమి చేస్తున్నారో చూడండి. చైనా భారీగా టారిఫ్‌లు విధిస్తుంటుంది. భారత్, బ్రెజిల్, అనేక ఇతర దేశాలు కూడా. కనుక మనం అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని పాటించబోతున్నందున దానిని ఇక ఎంత మాత్రం జరగనివ్వం’ అని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా, తమ ఫోన్ కాల్‌తో ఉభయ అధినేతలు మోడీ యుఎస్ పర్యటన ప్లాన్ల గురించి కూడా చర్చించారని వైట్ హౌస్ ఆ నివేదికలో తెలియజేసింది. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ‘అక్రమ వలసదారులను తిరిగి తీసుకోవడానికి ఆయన (మోడీ) అంగీకరించారా’ అని ట్రంప్‌ను ప్రశ్నించారు. ‘ఆయన (మోడీ) ఏది సరైనదో అదే చేస్తారు.మేము చర్చించుకుంటున్నాం’ అని ట్రంప్ తెలిపారు. ‘నేను ఆయనతో సోమవారం ఉదయం సుదీర్ఘ ఫోన్ కాల్ జరిగింది. ఆయన వచ్చే నెల, బహుభా ఫిబ్రవరిలో వైట్ హౌస్‌కు రానున్నారు. మాకు భారత్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది’ అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో చెప్పారు. సోమవారం మోడీతో జరిపిన ఫోన్ కాల్‌పై ఒక ప్రశ్నకు అధ్యక్షుడు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ప్రధానితో ఫోన్ కాల్ వివరాల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘మోడీతో ఫోన్ కాల్‌లో) ప్రతిదీ ప్రస్తావనకు వచ్చింది’ అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ 2.0 సమయంలో యుఎస్‌కు ప్రధాని మోడీ తొలి పర్యటన ఆ ఫోన్ కాల్‌లో ఖరారైంది. అధ్యక్షుడుగా ట్రంప్ చివరి విదేశీ పర్యటన ఆయన మొడటి హయాంలో భారత్‌లో జరిగింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :