ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / హైదరాబాద్ : యవ్వనం వయస్సు నుండి మొదలు పెట్టి లేటు వయస్సు వరకు ఘాటు పనులు చేస్తూ 55 మంది మహిళలను మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి బాగోతం బయటపడింది. దీంతో అధికారులే ఆచార్యపోయే విషయాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఓ మహిళ ఇచ్చిన పిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... అతని వయస్సు 55 సంవత్సరాలు.. అతని మోసానికి బలైన వారు 55 మంది మహిళలు. తన వయస్సుకు తగిన వారిని, ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి ఆటలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని మోసాలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలను చూస్తే షాకింగ్‌గా ఉన్నాయి.మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్లే అతనికి ఆధారం.. ఈ సైట్ల ద్వారా 50 మంది మహిళలను మోసం చేసి, లక్షల రూపాయలు వారు వద్ద నుంచి లాగేశాడు. జంషెడ్‌పూర్‌కు చెందిన తపేష్.. 1992లో కోల్‌కతాలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 8 ఏళ్లు బాగానే కాపురం చేశాడు. ఆ తరువాత 2000 సంవత్సరంలో తపేష్ తన భార్య, బిడ్డలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవల గురుగ్రామ్‌లో ఓ మహిళ ఫిర్యాదుతో నాడు అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ నేడు లభ్యమైంది. మ్యాట్రియోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయ్యాడు.. సంప్రదాయబద్దంగా తామిద్దరం పెళ్లి చేసుకున్నామని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, పెళ్లయిన మూడు రోజులకే తపేష్ సదరు మహిళకు సంబంధించి ఆభరణాలతో సహా రూ. 20 లక్షలు తీసుకుని పారిపోయాడు. ఈ వివరాలన్నీ తన కంప్లైంట్‌లో పేర్కొంది బాధిత మహిళ ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడు తపేష్‌ను అరెస్ట్ చేశారు. దీంతో అధికారులే ఆచార్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Admin
Aakanksha News