Thursday, 05 March 2026 03:04:37 AM

రోదసిలో పుతిన్‌ రహస్య ఆయుధం...

ఏకంగా అణ్వాయుధాన్నే మోహరిస్తున్న రష్యా.... ‘కాస్మోస్‌ 2553’ ఉపగ్రహ సాయంతో సన్నాహాలు

Date : 07 December 2024 07:54 PM Views : 347

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : రష్యాకు చెందిన రహస్య ఉపగ్రహం ‘కాస్మోస్‌ 2553’ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. ప్రస్తుతం డమ్మీ వార్‌హెడ్‌ (ఆయుధం)తో భూకక్ష్య వెలుపలి హద్దుల్లో సంచరిస్తున్న ఈ ఉపగ్రహం సాయంతో మున్ముందు క్షిపణులను, అణ్వాయుధాలను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన పలు కీలక ఉపగ్రహాలను నాశనం చేసేందుకు రోదసిలో రష్యా ఓ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.అంతరిక్షంలో రష్యా మోహరించే ఆయుధానికి సంబంధించిన విడిభాగాలను ఈ ఉపగ్రహం పరీక్షిస్తున్నట్టు తాము భావిస్తున్నామని, దీని వల్ల ఎదురయ్యే ముప్పును తమ స్పేస్‌ కమాండ్‌ నిరంతరం పరిశీలిస్తున్నదని అమెరికా అధికారులు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికకు తెలిపారు.రష్యా సైనిక బలగాలను ఉక్రెయిన్‌లోకి పంపడానికి కొన్ని రోజుల ముందు (2022 ఫిబ్రవరిలో) రష్యాలోని ప్లెసెట్స్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి సూయజ్‌-2 రాకెట్‌ ద్వారా ‘కాస్మోస్‌ 2553’ను నింగిలోకి పంపారు. అనంతరం ఆ ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్య చివరి అంచున (భూమికి దాదాపు 2 కి.మీ. ఎత్తున) చేర్చారు. ఆ ప్రాంతమంతా వాన్‌ అలెన్‌ బెల్ట్స్‌ నుంచి వచ్చే రేడియో ధార్మికతతో సంతృప్తమై ఉంటుంది.ఇది ఉపగ్రహ భాగాలను నిర్వీర్యం చేస్తుంది. పనికిరాని లేదా నిలిపివేసిన ఉపగ్రహాలను నిశ్శబ్ధంగా వాటంతట అవే నాశనమయ్యేలా చేసేందుకు దూరంగా ఆ ప్రాంతంలోకి పంపుతారు. దీంతో ఆ ప్రాంతాన్ని ‘శ్మశాన కక్ష్య’ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాస్మోస్‌ 2553’ను ఆ కక్ష్యలో నిలపడం అమెరికా ఖగోళ పరిశీలకుల్లో అనుమానాలను పెంచుతున్నది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :