Wednesday, 23 September 2026 12:21:49 PM

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దుండగుల రాళ్ల దాడి

Date : 02 May 2023 10:48 AM Views : 468

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / కేరళ : వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ రైలును ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ రైల్వే స్పష్టం చేసింది.రాళ్ల దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రైలు భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగంతకులు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి, ఈ రైలు తిరునవయ-తిరూర్ మధ్య ప్రయాణిస్తుండగా.. కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :