Thursday, 05 March 2026 03:01:12 AM

దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలి

ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపు

Date : 16 January 2024 05:46 PM Views : 328

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / నేషనల్ వార్తలు : దేశ రాజ్యాంగాన్ని మార్చేయాల‌ని ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. ద‌క్షిణ కొరియాను నెంబ‌ర్ వ‌న్ శ‌త్రుదేశంగా ఆ రాజ్యాంగంలో పేర్కోవాల‌ని కిమ్ ఆదేశించారు. సోమ‌వారం జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌సంగిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణ కొరియాను పూర్తిగా ఆక్ర‌మించాల‌న్న సందేశాన్ని కూడా ఆయ‌న ఇచ్చారు. ఆ దేశంతో జ‌రిగిన అన్ని ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాల‌న్నారు. యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న నేప‌థ్యంలో ద‌క్షిణ కొరియాను సంపూర్ణంగా ఆక్ర‌మించేయాల‌న్నారు. మ‌ళ్లీ రిప‌బ్లిక్ ఆఫ్ కొరియాను స్థాపించాల‌న్నారు.పార్ల‌మెంట్ ప్ర‌సంగంలో భాగంగా ఆయ‌న ఓ ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. కొరియా ద్వీప‌క‌ల్ప ఏకీక‌ర‌ణ స‌మ‌యంలో నిర్మించిన రీయునిఫికేష‌న్ స్థూపాన్ని కూల్చివేయాల‌ని కిమ్ పేర్కొన్నారు. ఆ భారీ స్థూపం నేత్రాల‌కు వేద‌న మిగులుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నార్త్ కొరియా రాజ‌ధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఆ స్థూపాన్ని కిమ్ తండ్రి నిర్మించారు. ద‌క్షిణి కొరియాతో త‌రుచూ విబేధాల‌కు వెళ్తున్న నార్త్ కొరియా ఇటీవ‌ల ఒక‌టే ప‌నిగా మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న విష‌యం తెలిసిందే. ఓ వివాదాస్ప‌ద దీవి వ‌ద్ద‌కు వంద‌ల సంఖ్య‌లో ఆర్టిల్ల‌రీ బాంబుల‌ను ప్ర‌యోగించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :