ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో టెంట్లు తగలబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అగ్ని మాపక సిబ్బంది.. ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకుముందు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు గుడారాలు దగ్ధమయ్యాయి.కాగా, నిన్ననే కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరోసారి అగ్ని ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Admin
Aakanksha News