Wednesday, 12 February 2025 02:55:46 AM

ఆకాశంలో పేలిన స్టార్‌షిప్ రాకెట్...

Date : 18 January 2025 06:55 AM Views : 106

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ‘స్టార్‌షిప్’ కీలక ప్రయోగం విఫలమైంది. అధునాతన సాంకేతికతతో ఆధునికీకరించి, తొలి పరీక్షగా పేలోడ్ మాక్ శాటిలైట్టను ప్రయోగించగా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గురువారం సాయంత్రం 5.38 గంటల సమయంలో అమెరికాలోని టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్టార్‌షిప్ ఆకాశంలో ముక్కలు ముక్కలైంది. అప్‌గ్రేడ్ చేసిన స్టార్‌షిప్‌తోస్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాకెట్ ప్రోగ్రామ్‌ను మార్చవలసి ఉంటుందని వారు సూచించారు. ‘అప్పర్ స్టేజ్’లో సమస్య ఉన్నట్లు అర్థం అవుతోందని స్పేస్ ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ ధ్రువీకరించారు.రాకెట్ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ గగనతలంలో స్టార్‌షిప్ పేలిపోగా నారింజ రంగులో అగ్ని గోళాలు ఎగసిపడ్డాయి. పొగక కూడా వ్యాపించింది. స్టార్‌షిప్ శకలాలు ఆకాశంలో చెల్లాచెదురు కావడంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా విమానాల రాకపోకలపై అప్రమత్తత ప్రకటించారు. విమానాలకు శకలాలు తగిలితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని స్పేస్ ఎక్స్ సూచించింది. అటు వైపుగా విమానాలు రాకుండా చూసుకోవాలని సంస్థ సూచించింది. కాగా, నిరుడు మార్చిలో కూడా స్టార్‌షిప్‌కు ‘అప్పర్ స్టేజ్’ సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు కూడా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :