Friday, 21 March 2025 08:24:10 AM

కాంగోను వణికిస్తోన్న అంతుచిక్కని వ్యాధి..

ఇప్పటి వరకు 143 మంది మృతి : వెల్లడించిన వైద్యులు

Date : 10 December 2024 08:48 PM Views : 225

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 143 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు. వారిలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల సంఖ్యే అధికమని వైద్యులు తెలిపారు. వ్యాధి ఎందుకు, ఎలా సోకుతోందో డాక్టర్లకు కూడా తెలియడం లేదట. ఈ మిస్టరీ వ్యాధిని ‘డిసీజ్ ఎక్స్’గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్‌లో డిసీజ్ ఎక్స్ కేసులు 406 నమోదయ్యాయని అధికారులు తెలియజేశారు. ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణం అని వారు గుర్తు చేశారు. ఈ కారణంగానే డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోందో గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ హు) నిపుణులు అన్నారు. ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నామని డబ్లుహెచ్‌ఒ ఒక ప్రకటనలో తెలియజేసింది. వ్యాధి మూలాలు, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. వ్యాధి లక్షణాలు : జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, దగ్గు, జలుబుతో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీననత.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :