ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / నేషనల్ వార్తలు : అక్రమ క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పటాయి ప్రాంతంలోని ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో గ్యాంబ్లింగ్ జరుగుతోందనే సమాచారం మేరకు థాయిలాండ్ పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో మొత్తం 93 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గెస్ట్ హౌస్‌ని నిర్వహిస్తున్న కెల్వెల్కర్ అనే మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్టైన వారిలో చాలా మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం.ఈ రైడ్‌లో పోలీసులు భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ చిప్స్ విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుందనే తెలిసింది. ఈ రైడ్‌లో భారీగా మొబైల్స్, థాయ్ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన భారతీయుల్ని చికోటి ప్రవీణ్.. టూరిజం పేరుతో థాయిలాండ్ తీసుకెళ్లారని తెలుస్తోంది. మూడు రోజుల టూరిజం కోసం రూ.3 లక్షల చొప్పున వారి నుంచి చికోటి ప్రవీణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో భారతీయులతోపాటూ… మయన్మార్, థాయిలాండ్‌కి చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది.
Admin
Aakanksha News