ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / నేషనల్ వార్తలు : బ్యూటీపార్లర్ కి వెళ్లొద్దని భర్త చెప్పడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే...ఇండోర్ కు చెందిన బలరామ్ యాదవ్ ఇంట్లోనే కుట్టుపని చేసుకుంటూ భార్య రీనా యాదవ్ తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో రీనా యాదవ్ బ్యూటీ పార్లర్ కు వెళ్తానని చెప్పగా భర్త బలరామ్ వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకొని మాటా మాటా పెరిగి గొడవగా జరిగింది. దీంతో భర్త తీరుతో మనస్తాపం చెందిన రీనా యాదవ్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.ఎంతకీ భార్య బయటకు రాక పోవడంతో బలరామ్ యాదవ్ తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. లోపల ఫ్యాన్ కు ఉరేసుకున్న రీనా యాదవ్ ను చుట్టుపక్కల వాళ్లను పిలిచి కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Aakanksha News