ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్ రంజనమ్ పాండేను ఆర్థిక సంఘం సెక్రెటరీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్ 31న ముగియనుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి ఛైర్మన్‌గా అరవింద్ పనగరియను ప్రధాని మోదీ 2015లో నియమించారు.కాగా అరవింద్ పనగరియ 1952 సెప్టెంబర్ 30న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం అనంతరం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతేగాక ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB), ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) లలో పనగరియ వివిధ హోదాల్లో పనిచేశారు.
Admin
Aakanksha News