Tuesday, 22 September 2026 10:23:15 AM

ఓటుకు నోటు కేసుపై కీలక నిర్ణయం...

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట..

Date : 20 September 2024 02:49 PM Views : 391

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్ధనను నిరాకరించింది. కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ద్విసభ్య ధర్మాసనం.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనను తిరస్కరించింది. ఒకవేళ, కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నట్టయితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :