Wednesday, 23 September 2026 12:21:56 PM

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది.... తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయి

పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన

Date : 21 July 2025 07:54 PM Views : 355

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని.. దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పడం సరికాదన్నారు.రాజ్యసభలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్‌ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 90 శాతం వరకు పోస్టులు భర్తీ జరిగేలా చేస్తాం’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :