Friday, 07 August 2026 03:40:39 AM

మొబైల్‌లో పోర్న్ క్లిప్ చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హ‌త్య...

యూపీ లోని క‌స్‌గంజ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న...

Date : 07 February 2024 04:11 PM Views : 318

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : యూపీ లో ఓ షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. 19 ఏళ్ల కుర్రాడు త‌న మైన‌ర్ సోద‌ర్ని రేప్ చేసి హ‌త్య చేశాడు. క‌స్‌గంజ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. సంజూ అనే వ్య‌క్తి త‌న మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసిన త‌ర్వాత త‌న సోద‌రిపై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇంట్లో చెబుతుంద‌న్న భ‌యంతో సోద‌ర్ని అత‌ను హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.కేసును ద‌ర్యాప్తు చేస్తున్న స‌మ‌యంలో ఈ విషయాలు వెల్ల‌డైన‌ట్లు పోలీసులు చెప్పారు. ప‌టియాలీ కొత్వాలి ఇంచార్జ్ ఎస్ఐ గోవింద్ బ‌ల్ల‌బ్ శ‌ర్మ ద‌ర్యాప్తు అంశాల‌ను ప్ర‌క‌టించారు. త‌న మేన‌ల్లుడి గురించి అత‌ని మామ ఫిర్యాదు ఇచ్చిన‌ట్లు పోలీసులు చెప్పారు.ఫిబ్ర‌వ‌రి 4వ‌ తేదీన ఫిర్యాదు ఇచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలించారు. సోమ‌వారం సాయంత్రం అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సంజూ తండ్రి ఏడాది క్రిత‌మే మ‌ర‌ణించాడు. త‌ల్లి, సోద‌రితో క‌లిసి అత‌ను జీవిస్తున్నాడు. అయితే అఘాయిత్యం జ‌రిగిన రోజున త‌ల్లి బంధువ‌ల ఇంటికి వెల్లింది. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఆ కుర్రాడు త‌న సోద‌రిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మొబైల్‌లో పోర్న్ చూసిన అత‌ను చెల్లెల్ని రేప్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :