Tuesday, 22 September 2026 11:59:38 AM

బీసీ ప్రధానమంత్రి ఉన్న బీసీలకు న్యాయం దక్కడం లేదు...

బీసీ గణన పై జాతీయస్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... ఢిల్లీ ధర్నాలో బీసీ నేతలు

Date : 05 December 2024 08:11 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : వచ్చే జనవరి నెల నుండి దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో బీసీ కులగనను చేపట్టాలని, బీసీ కులగన్న ద్వారానే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీ గణన చేయకుండా జాతి గణన కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతమని వివిధ బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు ప్రకటించారు.నేడు అఖిలభారత ఓబిసి ఉద్యోగుల సంఘం ఫెడరేషన్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాల సయుక్త ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు దేశవ్యాప్తంగా జరిగే జనగణలో బీసీ బీసీ గణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని,కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ లతో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా దర్నా నిర్వహించారు, ఈ మహా ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ ప్రతినిధులు వందలాదిమంది హాజరయ్యారు ఓబిసి ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు జీ కరుణానిధి అధ్యక్షతన జరిగిన ధర్నాకు మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పు యాదవ్, వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం పైగా ఉన్న ఓబీసీలను అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు ఓబీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ ఓబీసీలకు ఎలాంటి మేలు జరగడంలేదని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఓబీసీ డిమాండ్లను ఏ ప్రభుత్వం పరిష్కరించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు మరో నెల రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ గణన చేపట్టాలని బీసీ గణన చేపడితే దేశ సమగ్రత దెబ్బతింటుంది అన్న సుడోమేధావులు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కలు సేకరిస్తే దేశ సమగ్రత దెబ్బతినదా ? అని వారు ప్రశ్నించారు బీసీ గణన చేయాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, చివరికి ఆర్ఎస్ఎస్ లాంటి కూడా మద్దతు తెలిపిన… నేటి వరకు ఒక బీజేపీ పార్టీ మాత్రం మద్దతు తెలుపడం లేదన్నారు కులగణనకు అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నాయన్నారు అందుకే జాతి జన గణ లో బీసీ గనన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారుబీసీ డిమాండ్ ల సాధన కోసం రైతు ఉద్యమ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని చేపడుతామని,మా దేశంలో మరో మహా మండల్ ఉద్యమానికి సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ ఆందోళనలతో కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, దానకర్ణ చారి, జి పాండు కురుమ, ఎం భాగ్యలక్ష్మి రవి ముదిరాజ్, కలకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, రామరాజు యాదవ్, ఉప్పరి శేఖర్ సగర, యు చిన్నయ్య, జి మల్లేష్, నాగమల్లేశ్వరరావు, ఐలి వెంకన్న, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, నరసింహ నాయక్, జాజుల లింగం, గణేష్, రామస్వామి, జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :