Friday, 07 August 2026 04:25:11 AM

పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా..

Date : 03 February 2024 04:55 PM Views : 325

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ఇతర కమిట్‌మెంట్ల రీత్యా పంజాబ్ గవర్నర్‌ పదవికి, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆయన శుక్రవారంనాడు కలుసుకున్నారు.ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఇటీవల అనూహ్య విజయం సాధించింది. తక్కిన మూడు పదవులను కూడా నిలుపుకొంది. దీంతో కాంగ్రెస్-ఆప్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఇరు పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలో బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :