ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై ఆప్ చీఫ్ చేసిన ముడుపుల ఆరోపణలపై ఆయనను ప్రశ్నించేందుకు ఎసిబి బృందం ప్రయత్నించినప్పుడు వారికి ఆయన నివాసం లోపలికి వెళ్లనివ్వలేదు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు వోట్ల లెక్కింపుజరగడానికి ముందు రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. బిజెపిపై ఆప్ చేసిన ‘ఆపరేషన్ లోటస్’ ఆరోపణపై దర్యాప్తు నిర్వహించాలని ఎసిబిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా ఆదేశించారు. కేజ్రీవాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయవాది ఎసిబికి ఈ చర్య తీసుకునేందుకు అధికారం లేదని స్పష్టం చేశారు.‘వారి వద్ద ఎటువంటి పత్రాలూ లేవు. రాజకీయ ప్రహసనం సృష్టికి బిజెపి పన్నిన కుట్ర ఇది’ అని ఆయన ఆరోపించరు. పార్టీ ఫిరాయించేందుకు తమ అభ్యర్థులకు బిజెపి రూ. 15 కోట్లు ఇవ్వజూపిందన్న ఆప్ ఆరోపణ ఈ వివాదానికి మూలం. తమ అభ్యర్థుల్లో 16 మందికి పార్టీ మారినట్లయితే ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేశారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇంతకుముందు ఆరోపించారు. ఆప్ ఆరోపణలపై ఢిల్లీ బిజెపి కార్యదర్శి విష్ణు మిత్తల్ ఫిర్యాదు చేసిన తరువాత ఎల్‌జి ఎసిబి దర్యాప్తునకు ఆదేశించారు. ‘అర్వింద్ కేజ్రావాల్, సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలు ఎంతో తీవ్రమైనవి. తక్షణ దర్యాప్తు జరిపించవలసినవి’ అని మిత్తల్ ఎల్‌జి సక్సేనాకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు తమ ఆరోపణల ధ్రువీకరణకు ఎటువంటి రుజువులూ లేదా ఆధారాలూ చూపలేదని మిత్తల్ తెలిపారు.‘
Admin
Aakanksha News